మరోసారి భయపెడుతున్న ఆర్జీవి 12’O క్లాక్

చిన్నపిల్లలు చాక్లెట్స్ తిన్నంత ఈజీగా సినిమాలు చేసేస్తాడు ఆర్జీవి. అది షార్ట్ ఫిల్మో, బయోపిక్కో, వెబ్ సీరిస్సో, వన్ అవర్ ఫిల్మో అర్ధం కాక చాలామంది తలలు పట్టుకుంటారు. అందుకే, ఈసారి ఇది షార్ట్ ఫిలిం కాదు అని ముందుగానే చెప్పి మరీ 12 ఓ క్లాక్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం మ్యూజిక్ పైన విజువల్స్ ని కట్ చేశారు.

అంతేకాదు, ఫుల్ లెంగ్త్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తికూడా రేకెత్తింది. మరోసారి రామ్ గోపాల్ వర్మ తన మార్క్ డైరెక్షన్ ని ఇందులో చూపించాడు. కొత్త కొత్త ఫ్రేమ్స్ పెడుతూ హారర్ అంటే ఇలా కూడా ఉంటుందని చూపిస్తున్నాడు. అంతేకాదు, హారర్ సినిమాలకి రామ్ గోపాల్ వర్మ పెట్టింది పేరు కాబట్టి, చాలా ఈజీగా ఈసినిమాని డీల్ చేసేశాడు. 12 ఓ క్లాక్ సినిమాలో ఆశిష్ విద్యార్ధి, మిధున్ చక్రవర్తి కీ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కి, దెయ్యాలకి సంబంధం ఏంటి అనే అంశంపై ఈ సినిమా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ ని అందించడం విశేషం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.