రివైజింగ్ కమిటీ కూడా కాజల్ కి సహాయపడలేకపోయింది

బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం “క్వీన్”ను సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో రీమేక్ చేయడం కోసం ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రీమేక్ కార్యక్రమాలు మొదలెట్టినప్పటికీ.. ఎందుకనో ఇప్పటివరకూ ఏ ఒక్క వెర్షన్ కూడా విడుదలకు నోచుకోలేదు. తెలుగు వెర్షన్ విడుదలవుతుందన్నా నమ్మకం కూడా లేదు జనాలకి. తెలుగు వెర్షన్ లో తమన్నా, తమిళ వెర్షన్ లో కాజల్, కన్నడ వెర్షన్ లో పరుల్ యాదవ్ & మలయాళ వెర్షన్ లో మంజిమా మోహన్ నటిస్తున్నారు. అన్నీ వెర్షన్స్ రీమేక్స్ సంబంచించిన టీజర్లు విడుదలైనప్పటికీ.. తమిళ వెర్షన్ కు క్రియేట్ అయినంత బజ్ ఏ ఇతర భాషా రీమేక్ కు రాలేదు. అందుకు కారణం టీజర్ లోని కాజల్ స్థనాన్ని ఆమె స్నేహితురాలు పట్టుకొనే సీన్.

kajal-aggarwal-in-paris-paris

సెన్సార్ విషయంలో కూడా ఆ సీన్ పెద్ద రచ్చ చేసింది. ఆ సీన్ ను సినిమా నుంచి తొలగించాలని సెన్సార్ శభుయిలు చెప్పడంతో.. రివైజింగ్ కమిటీ దగ్గరకి వెళ్లారు సినిమా యూనిట్. అక్కడ కూడా ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. దాంతో ఆ సీన్ ను కట్ చేయడానికి ఒప్పుకొన్నారు దర్శకనిర్మాతలు. దాంతో సినిమాలో ఆ సీన్ ఉండబోదనే క్లారిటీ వచ్చేసింది. అలాగే మొత్తం 25 కట్స్ ఉంటాయట సినిమాలో.

Share.