2019 లో వచ్చిన రీమేక్ సినిమాలు..!

2019 వ సంవత్సరంలో చాలా వరకూ రీమేక్ సినిమాలు వచ్చాయి. వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సమంత, నిఖిల్ వంటి వారు రీమేక్ లతో హిట్లు అందుకున్నారు. అలాగే మన దగ్గర బ్లాక్ బస్టర్ లు కొట్టిన సినిమాల్ని కూడా ఇతర భాషల్లో రీమేక్ చేసి వాళ్ళు కూడా హిట్లు అందుకున్నారు. అలా బాలీవుడ్ లో చేసిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కభీర్ సింగ్’.. ఏకంగా 300 కోట్ల పైనే వసూళ్ళను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. మరి ఈ 2019 లో మన వాళ్ళు చేసిన రీమేక్ లు అలాగే.. మిగిలిన భాషల్లో మన రీమేక్ అయిన తెలుగు సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) గద్దలకొండ గణేష్ : తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ చిత్రం తెలుగులో కూడా ‘చిక్కడు దొరకడు’ గా డబ్ అయ్యింది. కానీ మన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని ‘గద్దలకొండ గణేష్'(వాల్మీకి) గా మళ్ళీ రీమేక్ చేసి హిట్టందుకున్నాడు.

1-Gaddalakonda Ganesh

2) ఓ బేబీ : సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి డైరెక్ట్ చేసింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి ఇది రీమేక్.

2-Oh Baby

3) మన్మధుడు2 : ‘కింగ్’ నాగార్జున నటించిన ‘మన్మధుడు2’ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసాడు. ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్ రీమేక్ చిత్రానికి ఇది రీమేక్.

2-Manmadhudu 2

4) అర్జున్ సురవరం : నిఖిల్, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన ‘అర్జున్ సురవరం’ చిత్రం కూడా ‘కనిథన్’ అనే తమిళ రీమేక్ కావడం విశేషం.

4-Arjun Suravaram

5) ఎబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) : అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఓ మలయాళ రీమేక్.

5-ABCD

6) ఫలక్ నుమా దాస్ : విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ‘అంగమలై డైరీస్’ అనే మలయాళం రీమేక్ కావడం విశేషం.

6-Falaknuma Das

7) ఫస్ట్ ర్యాంక్ రాజు : ఈ చిత్రం కూడా ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ అనే కన్నడ రీమేక్ కావడం విశేషం.

7-1st Rank Raju

8) రాక్షసుడు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా నటించిన ‘రాక్షసుడు’ చిత్రాన్ని ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్ట్ చేసాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాట్ససన్’ చిత్రానికి ఇది రీమేక్.

16-Rakshasudu

9) ఎవరు : అడివి శేష్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇన్విజిబుల్ గెస్ట్’ అనే స్పానిష్ మరియు ‘బద్ లా’ అనే హిందీ చిత్రాల రీమేక్ కావడం విశేషం.

8-Evaru

10) కౌసల్య కృష్ణమూర్తి : ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసాడు. ‘కణా’ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం.

9-Kousalya Krishnamurthy

మన దగ్గర్నుండీ రీమేక్ అయిన సినిమాలు :

1) కభీర్ సింగ్ : మన దగ్గర బ్లాక్ బస్టర్ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని అదే దర్శకుడైన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు.

10-Kabir Singh

2) ఆదిత్య వర్మ : మన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్ తో తీసి హిట్ కొట్టారు. సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకుడు.

11-Adithya Varma

3) ప్రస్థానం : మన దగ్గర హిట్ అయిన ప్రస్థానం చిత్రాన్ని హిందీ లో కూడా అదే పేరుతో తీసాడు దర్శకుడు దేవ్ కట్టా.

12-Prasthanam

4) పెట్రో మ్యాక్స్ : మన దగ్గర సూపర్ హిట్ అయిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రాన్ని హిందీలో పెట్రోమాక్స్ పేరుతో రీమేక్ చేశారు.

13-Petromax

5) 100 % కాదల్ : మన దగ్గర సూపర్ హిట్ అయిన ‘100 % లవ్’ చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్’ గా రీమేక్ చేశారు.

14-100 Love

6) టెంపర్ : ఎన్టీఆర్, పూరి ల ‘ఆల్ టైం హిట్’ అయిన ‘టెంపర్’ ను ‘అయోగ్య’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు.

15-Temper

Share.