సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

సూపర్ స్టార్ కృష్ణ మరియు ఆయన మొదటి భార్య ఇందిరా దేవికి పుట్టిన రెండో సంతానం మహేష్ బాబు. 1975, ఆగస్ట్ 9న చెన్నైలో పుట్టారు మహేష్.

mahesh-babu-reel-and-real-life-secrets1

నాలుగేళ్ల వయసులోనే నీడ అనే సినిమాలో నటించి.. తన ప్రస్థానానికి గట్టి పునాది వేసుకొన్నాడు మహేష్.

mahesh-babu-reel-and-real-life-secrets2

“రాజకుమారుడు”తో కథానాయకుడిగా పరిచయమవ్వడానికి ముందు మహేష్ 9 సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. వాటిలో “గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న-తమ్ముడు” చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

mahesh-babu-reel-and-real-life-secrets3

“కొడుకు దిద్దిన కాపురం” చిత్రంలో మహేష్ బాబు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తర్వాత మహేష్ మళ్ళీ డబుల్ రోల్ ఇప్పటివరకు ప్లే చేయలేదు.

mahesh-babu-reel-and-real-life-secrets4

1999లో పరిచయమైన తొలి చిత్రం “రాజకుమారుడు”తోనే ఉత్తమ డెబ్యు హీరోగా మొదటి నంది అవార్డ్ అందుకున్నాడు మహేష్ బాబు.

mahesh-babu-reel-and-real-life-secrets5

2003లో వచ్చిన “ఒక్కడు” మహేష్ బాబు కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం అనంతరం తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ చేయబడింది. ఆ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా మహేష్ నటన ఇప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు బాగా ఇష్టం.

mahesh-babu-reel-and-real-life-secrets6

“వంశీ” సినిమాలో తనకు జంటగా నటించిన నమ్రత శిరోధ్కర్ తో నాలుగేళ్ల ప్రేమ వ్యవహారం అనంతరం అక్క మంజుల సహాయంతో కుటుంబ సభ్యులను ఒప్పించి నిరాడంబరంగా ముంబై మ్యారియట్ హోటల్లో ఫిబ్రవరి 10, 2005లో వివాహం చేసుకొన్నారు.

mahesh-babu-reel-and-real-life-secrets7

అప్పటివరకూ మహేష్ బాబు లుక్స్ వరకే బాగుంటాడు అని గేలి చేసిన వాళ్లందరికీ.. “నిజం” సినిమాలో పెర్ఫార్మెన్స్ తో ముక్కున వేలేసుకొనేలా చేశాడు మహేష్. ఆ సినిమాతో ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ అందుకోవడం విశేషం.

mahesh-babu-reel-and-real-life-secrets8

ఇక “పోకిరి” సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో అయిపోయాడు మహేష్. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్, క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికీ చర్చనీయాంశం. సూపర్ స్టార్ అభిమానులకు గర్వకారణం.

mahesh-babu-reel-and-real-life-secrets9

“సైనికుడు, అతిధి, ఖలేజా” లాంటి వరుస బాక్సాఫీస్ డిజాస్టర్స్ తో కాస్త ఢీలాపడిన మహేష్ బాబు “దూకుడు”తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. ఓవర్సీస్ మార్కెట్ కింగ్ గా ఎదిగాడు.

mahesh-babu-reel-and-real-life-secrets10

“దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రాలతో మొదటి హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకొన్నాడు మహేష్.

mahesh-babu-reel-and-real-life-secrets11

“1 నేనొక్కడినే, ఆగడు” లాంటి డిజాస్టర్స్ తర్వాత “శ్రీమంతుడు”, “బ్రహ్మోత్సవం, స్పైడర్” లాంటి సూపర్ ఫ్లాప్స్ తర్వాత “భరత్ అనే నేను” చిత్రాలతో మహేష్ కెరీర్ కి ఊపిరి పోసాడు కొరటాల శివ. అందుకే.. మహేష్ బాబుకి డైరెక్టర్ కొరటాల అంటే విశేషమైన అభిమానం.

mahesh-babu-reel-and-real-life-secrets12

మహేష్ బాబులోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసిన మొదటి దర్శకుడు త్రివిక్రమ్. “ఖలేజా” సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. మహేష్ కూడా కామెడీ చేయగలడు అని ప్రూవ్ చేయడమే కాక.. సరికొత్త మహేష్ బాబుని ఇండస్ట్రీకి రీఇంట్రడ్యూస్ చేసిన సినిమా అది.

mahesh-babu-reel-and-real-life-secrets13

పవన్ కళ్యాణ్ నటించిన “జల్సా” సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం. తర్వాత ఎన్టీఆర్ “బాద్ షా”, తండ్రి కృష్ణ నటించిన ఆఖరి చిత్రం “శ్రీ శ్రీ”, అక్క మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం “మనసుకి నచ్చింది” చిత్రాలకు కూడా మహేష్ వాయిస్ ఓవర్ అందించారు.

mahesh-babu-reel-and-real-life-secrets14

“శ్రీమంతుడు” సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగిడారు మహేష్. బ్రహ్మోత్సవంకి కూడా నిర్మాణ భాగస్వామిగా బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం అడివి శేష్ హీరోగా “మేజర్” మరియు ఆయన హీరోగా తెరకెక్కుతున్న “సరిలేరు నీకెవ్వరు” చిత్రాలకు మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

mahesh-babu-reel-and-real-life-secrets15

తెలుగులో ఆరు నంది అవార్డ్స్ గెలుచుకొన్న ఏకైక కథానాయకుడు మహేష్ బాబు కావడం విశేషం.

mahesh-babu-reel-and-real-life-secrets16

తమిళ నటుడు కార్తీ, మహేష్ బాబు చెన్నైలో క్లాస్ మేట్స్. కానీ.. ఇద్దరినీ ఒక వేదికపై మాత్రం ఇప్పటివరకూ ఎవరూ చూడలేదు.

mahesh-babu-reel-and-real-life-secrets17

ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకొన్న మొదటి యంగ్ హీరో మహేష్ బాబు, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ 2013లో షారూఖ్ ఖాన్, సల్మాన్, ఖాన్ వంటి బాలీవుడ్ అగ్ర కథానాయకులను కూడా వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు మహేష్.

mahesh-babu-reel-and-real-life-secrets18

కనిపించడానికి చాలా అమాయకుడిలా ఉండే మహేష్ బాబుకి బోలెడంత వెటకారం. ఆయన షూటింగ్ స్పాట్ లో వేసే పంచ్ లకు యూనిట్ అందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారట. మీడియా ఇంటరాక్షన్స్ లోనూ మహేష్ బాబు తన టైమింగ్ తో ఆకట్టుకొంటాడు.

mahesh-babu-reel-and-real-life-secrets19

30కి పైగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేసి ఉండడం గమనార్హం. ఈ ఏడాది తన స్వంత బట్టల బ్రాండ్ “హంబుల్” (HUMBLE)ను ప్రారంభించాడు మహేష్.

mahesh-babu-reel-and-real-life-secrets20

విచిత్రం ఏమిటంటే.. చెన్నైలో పుట్టి పెరగడం, విద్యాభ్యాసం కారణంగా మహేష్ బాబుకి తెలుగు మాట్లాడడం వచ్చు కానీ.. చదవడం మాత్రం రాదు.

mahesh-babu-reel-and-real-life-secrets21

“భరత్ అనే నేను, మహర్షి” లాంటి సూపర్ హిట్స్ తర్వాత “సరిలేరు నీకెవ్వరు”తో 2020 సంక్రాంతి బరిలో డిగనున్నాడు మహేష్. దాదాపు ఏడేళ్ళ తర్వాత సెకండ్ హ్యాట్రిక్ కొట్టడానికి సన్నద్ధమవుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం.

mahesh-babu-reel-and-real-life-secrets22

విష్ యు ఆల్ ది బెస్ట్ మహేష్ బాబు.
ఫ్రమ్ టీం ఫిల్మీ ఫోకస్ (www.filmyfocus.com)

Share.