‘రెడ్’ 5 డేస్ కలెక్షన్స్..!

‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫామ్లో ఉన్న రామ్ నటించిన తాజా చిత్రం ‘రెడ్’. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైన ఈ చిత్రంలో మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ లు హీరోయిన్లుగా నటించారు.కెరీర్ లో మొదటిసారి రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన చిత్రమిది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకంఫై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి మొదటిరోజు యావరేజ్ టాక్ మాత్రమే వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది అనే చెప్పాలి. విడుదలైన 5 రోజుల్లోనే ‘రెడ్’ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఆ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం 5.66 cr
సీడెడ్ 2.82 cr
ఉత్తరాంధ్ర 1.61 cr
ఈస్ట్ 1.29 cr
వెస్ట్ 1.41 cr
కృష్ణా 1.00 cr
గుంటూరు 1.05 cr
నెల్లూరు 0.83 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 15.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.70 cr
ఓవర్సీస్ 0.32 cr
టోటల్ వరల్డ్ వైడ్ 16.67 cr

‘రెడ్’ చిత్రానికి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 16.67 కోట్ల షేర్ ను నమోదు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లు అంతా సేఫ్ అయిపోయారనే చెప్పాలి. సోమవారం రోజున కూడా ఈ చిత్రం కోటి రూపాయల పైనే షేర్ ను రాబట్టడం మరో విశేషం. ఇక ‘రెడ్’ హిట్ తో రామ్ హ్యాట్రిక్ ను కంప్లీట్ చేసేసాడు.

Click Here To Read Movie Review

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.