వెంకీ, వరుణ్ సినిమాకు.. మరో లాభం

2019 సంక్రాంతికి విడుదలై బెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమాల్లో F2 ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ అందించిన కామెడీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి లాభాలను అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పెట్టిన పెట్టుబడికి నిర్మాత దిల్ రాజుకు అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక సినిమా ప్రాంఛైజ్ ను వాడుకుంటూ F3ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన బిజినెస్ చర్చలు కూడా అప్పుడే మొదలైనట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజుకు F3 షూటింగ్ మొదలైన ముందు రోజు నుంచే డిజిటల్ రైట్స్ పై అనేక రకాల ఆఫర్లు వాస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ ఒక మాట కూడా అనేసుకుందట. F3 డిజిటల్ రైట్స్ కోసం దాదాపు 25కోట్లకు పైగా ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. ఇటీవల పూజా కార్యక్రమాలతో చాలా సింపుల్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకోలేదు.

కానీ అప్పుడే హై రేంజ్ లో లాభాలను అందిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకుంటున్నాడు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.