ఆ విషయం పై వితిక క్లారిటీ ఇచ్చేసింది..!

‘బిగ్ బాస్ సీజన్3’ లో కంటెస్టెంట్ లు గా ఎంట్రీ ఇచ్చిన భార్యాభర్తలు వరుణ్ సందేశ్, వితిక షేర్. హౌస్ లో వీరు చిన్న చిన్న గొడవలు పడినప్పటికీ వెంటనే మళ్ళీ ‘సారీ’ చెప్పుకుని కలిసి పోవడం వంటివి ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టున్నాయి. హౌస్ నుండీ బయటకి వచ్చాక వీరికి అభిమానులు పెరిగిన సంగతి కూడా తెలిసిందే. ఇక వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వీరు బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వితిక ‘బిగ్ బాస్’ హౌస్ కు వెళ్ళడానికి ముందు సూసైడ్ అటెంప్ట్ చేసిందని… వరుణ్ తో మనస్పర్థలు రావడం వల్లనే ఇలా చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

5varun-sandeshs-wife-vithika-sedhu

అయితే ఆ వార్తల్లో నిజం లేదని… వితిక చెబుతుంది. ఆమె మాట్లాడుతూ.. ” అమెరికా వాతావరణానికి అలవాటు పడిన నాకు ఇండియా వచ్చిన తరువాత పెద్దగా నిద్ర పట్టేది కాదు. దీంతో మొదటిసారి నిద్ర మాత్ర వేసుకున్నానని… మోతదుకు మించి నాలుగు టాబ్లెట్లు వేసుకోవడంతో ఘాడ నిద్రలోకి వెళ్ళిపోయాను. అది చూసిన మా అమ్మకు భయమేసి హాస్పిటల్లో చేర్చింది. ఆ టైములో నా ఫోన్లో తీసిన ఓ ఫొటో నా స్నేహితురాలు చూడటం.. ఆమె దాన్ని షేర్ చేయడంతో పెద్ద ఇష్యూ అయ్యింది. దాన్ని ఆధారం చేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేసానని ప్రచారం జరిగింది. అంతే తప్ప మరేమీ లేదని తెలిపింది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.