ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని లయ రిజెక్ట్ చేయడానికి కారణం

తెలుగు తెరపై అగ్ర కథానాయిక స్టేటస్ ను ఎంజాయ్ చేసిన అతి తక్కువమంది తెలుగు అమ్మాయిల్లో లయ ఒకరు. చిన్న హీరోల సరసన నటించడం మొదలెట్టి.. బడా స్టార్ హీరోలవరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకొంది. అనంతరం పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఆమెను మళ్ళీ తెలుగు సినిమాల్లో నటింపజేయడం కోసం ఎంతగా ప్రయత్నించినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించింది.

reason-behind-why-laya-rejected-aravindha-sametha-movie1

అయితే.. లయకు ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన “అరవింద సమేత” చిత్రంలో ఎన్టీఆర్ తల్లి పాత్ర చేసే అవకాశం లభించిందట. కానీ ఆమె ఆఫర్ను తిరస్కరించింది. అందుకు కారణం ఆమె అప్పుడే తల్లి పాత్రలు చేయడానికి సిద్ధంగా లేకపోవడమే. అక్క, అత్త పాత్రల వరకు పర్లేదు కానీ.. మరీ హీరో తల్లిగా చేయడం అంటే నా వల్ల కాదు. అందుకే ఆ సినిమాను రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది లయ. ఆమె చెప్పిన విషయంలో లాజిక్ ఉన్నప్పటికీ.. ఆ లాజిక్ ని మన తెలుగు ఫిలిమ్ మేకర్స్ ఎంతవరకు పట్టించుకొంటారు అనేది ఆమెకే తెలియాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.