రెమ్యూనరేషన్ మరీ ఎక్కువ అడగడంతో మేకర్స్ ఆమెను పక్కన పెట్టారట!

ప్రెజంట్ జాతీయస్థాయిలో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ & పాపులారిటీకి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ కోసం క్యూ కడుతున్నారు. అలాంటిది కాజల్ ఆగర్వాల్ కు “సాహో”లో ప్రభాస్ సరసన నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చినా కాదనుకొంది. అయితే.. ఆమెను సంప్రదించింది హీరోయిన్ రోల్ కోసం కాదండోయ్.. సాహో సినిమాలోని స్పెషల్ సాంగ్ అయిన “బ్యాడ్ బోయ్” ఐటెమ్ నెంబర్ కోసం. ఆల్మోస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్ లాంటి ఈ సాంగ్ లో తొలుత కాజల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట.

kajal-latest-photoshoot-stills

ఆమె ఏకంగా 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడగడంతో.. తెలుగులోపాటు బాలీవుడ్ మరియు సోషల్ మీడియాలో విశేషమైన పాపులారిటీ ఉన్న జాక్వలిన్ ను ఫైనల్ చేశారట మేకర్స్. ఇప్పుడు ఆ సాంగ్ ఎంత పాపులర్ అయ్యింది అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సాంగ్ చేసి ఉంటే కాజల్ కి భీభత్సమైన పాపులారిటీ వచ్చి ఉండేది. అనవసరంగా రెమ్యూనరేషన్ కోసం కక్కుర్తిపడి వదిలేసుకొంది అమ్మడు.

0saaho-movie

ఇకపోతే.. ఈ శుక్రవారం విడుదలవుతున్న “సాహో” సినిమా మీద భీభత్సమైన అంచనాలున్నాయి. ఆల్రెడీ బుకింగ్స్ మొదలవ్వడం.. కొన్ని చోట్ల టికెట్స్ అమ్ముడైపోవడం ఆశ్చర్యకరం. దాన్నిబట్టి సినిమా మీద ఏ రేంజ్ క్రేజ్ ఉంది అనేది అర్ధం చేసుకోవాలి. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా వంద కోట్లు కలెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ టాస్క్. మరి బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

Share.