‘ప్రతీరోజు పండగే’ సినిమాని రిజెక్ట్ చేసిన దిల్ రాజు..!

తాజాగా విడుదల చేసిన ‘ప్రతీరోజు పండగే’ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ చూసిన తర్వాత ఈ చిత్రం ‘సంక్రాంతికి వస్తే బాగుణ్ణు’ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు అంటే ఈ చిత్రం పై ఎంత పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ట్రైలర్ ప్రారంభంలో ఈ చిత్రం లైన్ ‘శతమానం భవతి’ లా అనిపించినప్పటికీ ఎండింగ్ లో ఆ ఫీల్ పోగొట్టేసేలా ఓ డైలాగ్ తో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కథని మొదట దిల్ రాజు బ్యానర్ పై చేయాలనే ఉద్దేశంతో మొదట ఆయనకి చెప్పాడట డైరెక్టర్ మారుతీ.

Prathi Roju Pandaage Movie Shooting Update1

కానీ దిల్ రాజు రిజెక్ట్ చేసాడట. ‘కథ బాగుంది.. మారుతీ’..! కానీ నేను చేస్తే మళ్ళీ అందరూ ‘శతమానం భవతి’ ఫీల్ కు వెళ్ళిపోతారు అని అయన నాతో చెప్పారు దిల్ రాజు. దీంతో మళ్ళీ మా ‘భలే భలే మగాడివోయ్’ టీం తోనే ఈ చిత్రం చేశాను. ‘శతమానం భవతి’ సినిమాకి.. ‘ప్రతీరోజు పండగే’ సినిమాకి అస్సలు సంబంధం ఉండదు. కానీ మా సినిమాని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు మారుతీ. ఇక ‘ప్రతీరోజు పండగే’ చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతుంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.