Sonu Sood: సోనూసూద్ కొత్త అవతారం.. ఏమైందంటే..?

రియల్ హీరో సోనూసూద్ ధనిక, పేద తారతమ్యాలు చూడకుండా కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సహాయాలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ కు ప్రజల్లో ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ పెరుగుతోంది. ఏ కష్టం వచ్చినా తనకు వీలైతే సోనూసూద్ వెంటనే స్పందించి సహాయం చేస్తున్నారు. అయితే తాజాగా సోనూసూద్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోనూసూద్ ఆ వీడియోలో సైకిల్ పైనే సూపర్ మార్కెట్ ను ఓపెన్ చేశారు.

గుడ్లు, బెడ్లు అమ్ముతూ వాటిని హోం డెలివరీ కూడా చేస్తానని సోనూసూద్ వెల్లడించారు. కలియుగ దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ గుడ్లు అమ్మడాన్ని చూసి అతని అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. సోనూసూద్ సేల్స్ మ్యాన్ మాదిరిగా గుడ్లు, బ్రెడ్ల ధరలను వివరించడం గమనార్హం. 10 గుడ్లు కొనుగోలు చేస్తే బ్రెడ్ ఫ్రీ అని సోనూసూద్ అదిరిపోయే క్యాప్షన్ ను పెట్టారు. అయితే సోనూసూద్ ప్రజలు చిన్న వ్యాపారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశారని సమాచారం.

గతేడాది సోనూసూద్ వేల సంఖ్యలో వలస కార్మికులను ఆదుకున్న సంగతి తెలిసిందే. గుండె జబ్బుతో బాధ పడుతున్న చిన్నారులకు చికిత్స చేయించి సోనూసూద్ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. సోనూసూద్ చేసిన సేవలను ప్రజలు తెగ మెచ్చుకుంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో సోనూసూద్ లా ఇతర సెలబ్రిటీలు సైతం స్పందించి సహాయం చేస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Share.