‘ఆర్.డి.ఎక్స్ లవ్’ టీజర్ రివ్యూ..!

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్.డి.ఎక్స్ లవ్’. తాజాగా ఈ చిత్రం నుండీ టీజర్ ను వదిలారు. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో హీరోని వాడుకుని వదిలేసే యువతీ పాత్రలో కుర్ర కారుని రెచ్చగొట్టిన పాయల్ ఈ చిత్రంలో అంతకు మించిన డోస్ తో రాబోతుందని ఈ టీజర్ చెప్పకనే చెప్పింది. ‘ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్ లో పెట్టుకోవాలి.. తప్పదు అనుకుంటే సేఫ్టీలైన అందుబాటులో ఉంచుకోవాలి’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

rdx-love-movie-trailer-review1

దర్శకుడు శంకర్ భాను ఈ టీజర్ మొత్తం పాయల్ స్కిన్ షో పైనే నడిపాడు. ఈ చిత్రం మొత్తం యూత్ నే టార్గెట్ చేసారని స్పష్టమవుతుంది. ఏమాత్రం కంటెంట్ లేని ఈ టీజర్ లో పాయల్ గురించి తప్ప హీరో తేజస్ కంచర్ల గురించి కూడా పెద్దగా చెప్పేదేమీ లేదు. ఇక నిర్మాత సి.కళ్యాణ్ కు పెద్ద హీరోలు అవకాశం ఇవ్వకో… లేక హిట్లు పడట్లేదనో… ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాల పై పడినట్టు తెలుస్తుంది. టీజరే ఇలా ఉందంటే… ఇక ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో.. సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. శృతిమించిన ఈ శృంగారపు టీజర్ కేవలం కామంతో విల విలలాడేవారికి మాత్రమే..!

Share.