నిరాశపరిచిన పాయల్ రాజ్ పుత్..!

తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్.డి.ఎక్స్ లవ్’. శంకర్ భాను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘హ్యాపీ మూవీస్’ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఈ చిత్రంలో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటించడం అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో తన గ్లామర్ షో తో సెగలు పుట్టించిన పాయల్ ఈ చిత్రంలో కూడా.. అస్సలు తగ్గకుండా గ్లామర్ షో చేసి ఉంటుందని ముందే అనుకున్నారు. అందుకు తగ్గట్టే టీజర్లో ఆమె అందాల ఆరబోత హద్దులు దాటింది. టీజరే ఈ రేంజ్లో ఉంటే ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుందా అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు. మరి అందరి అంచనాలను ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ ట్రైలర్ అందుకుందా? లేదా? అనేది ఓ లుకేద్దాం రండి.

rdx-love-movie-trailer-review1

అనగనగా ఓ ఊరు.. ఆ ఊరికి ఓ సమస్య. ఆ ఊరి కొచ్చిన సమస్య తీర్చడం కోసం పోరాడే అమ్మాయి. ఆ అమ్మాయే మన హీరోయిన్ (పాయల్). ఆ హీరోయిన్ సిటీలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. మీడియా రిపోర్టర్ గా వర్క్ చేస్తున్నట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది. అల్లా విలన్ భాగోతాన్ని బయటపెట్టి తన ఊరికి వచ్చిన సమస్య తీర్చాలి. మధ్యలో హీరోతో ప్రేమలో పడటం, రొమాన్స్ చోటుచేసుకుంటుంది. తరువాత హీరో కూడా ఆమె పోరాడుతున్న సమస్య కోసం సాయం చేస్తాడు. ఇదే మెయిన్ పాయింట్ గా ట్రైలర్ ను కట్ చేశారు. టీజర్ చూసి ట్రైలర్ కోసం కామంతో తపించే కుర్రకారుకి మాత్రం ఈ ట్రైలర్ నిరాశకు గురిచేస్తుంది. ఈ ట్రైలర్లో పాయల్ గ్లామర్ షో చాలా తక్కువే. ఆమె ఓ విజయశాంతిలా యాక్షన్ సీన్లు చేసింది. ‘వేటాడాలనుకున్న మగాడికి.. ఆడ పిల్ల లేడి పిల్లలా కనిపించొచ్చు… అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగసింహం కూడా కుక్క పిల్లలా కనిపిస్తుంది అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది’ అనే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది.

Share.