మాస్ మహారాజ్ సినిమాకి మరో దెబ్బ పడింది..!

నాలుగు ప్లాప్ ల తో డీలా పడిపోయిన రవితేజ..తన తదుపరి చిత్రం ‘క్రాక్’ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.తనకి ‘డాన్ శీను’ ‘బలుపు’ వంటి హిట్ సినిమాలను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు. కచ్చితంగా ‘క్రాక్’ తో వీరిద్దరూ హ్యాట్రిక్ కొడతారని అంతా భావిస్తున్నారు. విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్,ఫస్ట్ సింగిల్ ప్రామిసింగ్ గా ఉండడంతో `క్రాక్‌` పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

కానీ అనూహ్యంగా ఈ చిత్రానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రం విడుదలను ఆపెయ్యాలి అంటూ కోర్టుకు వీళ్ళిందట.దాంతో ‘క్రాక్’ డిస్ట్రిబ్యూటర్లకు షాక్ తగిలినట్టు అయ్యింది. మేటర్ ఏంటంటే ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధు గతేడాది విశాల్ హీరోగా వచ్చిన ‘టెంపర్’ రీమేక్ ను నిర్మించాడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నష్టాలను తక్షణమే చెల్లించాలని ‘స్క్రీన్ సీన్ మీడియా’ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ కోరింది.

Krack Movie Team Back On Sets

నష్టపరిహారం చెల్లించకుండా ‘క్రాక్’ ను విడుదల చెయ్యకూడదు అంటూ వారు స్టే వేసారట. డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన నష్టాలను చెల్లించిన పక్షంలో హ్యాపీగా ‘క్రాక్’ ను విడుదల చేసుకోవచ్చని వారు కోరారట. చూడాలి మరి చివరికి ఈమె జరుగుతుందో..!

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Share.