క్రాక్ బాక్సాఫీస్ దూకుడు.. ఇలానే కొనసాగితే..

మాస్ మహారాజా రవితేజ మొత్తానికి క్రాక్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. కమర్షియల్ మాస్ డైరెక్టర్ గా గోపిచంద్ మలినేని కూడా మరోసారి తన సత్తా చాటుకున్నాడు. డాన్ శీను, బలుపు వంటి సినిమాల అనంతరం వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను గట్టిగానే అందుకుంటోంది. ఇక సినిమా కలెక్షన్స్ మొదట రోజే భారీ స్థాయిలో అందాయి. అసలైతే మొదటిరోజే ఎదురైన సమస్యల కారణంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా రాదా

అని ఎంతగానో అనుమానాలను క్రియేట్ చేసింది. కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఎదురైన విడుదల సమస్యలను చాలా తొందరగా క్లియర్ చేసుకొని సాయంత్రానికి సినిమాను వదిలారు. అయితే సినిమా హిట్ అవ్వడంతో ఆ బాధలను మర్చిపోయారు. ఇక సినిమా మూడవ రోజు ఈజీగా 2 కోట్లకు పైగా అందుకుంటుందని అనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే సినిమా రూ.2.86కోట్ల షేర్స్ ను అందించి నిర్మాతలకు బాధ లేకుండా చేసింది.

ఇక మాస్టర్ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ టాక్ అందుకోలేదు కాబట్టి క్రాక్ కు అది కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఇక సినిమా ఇలానే మరో మూడు రోజులు కలెక్షన్స్ అందుకోగలిగితే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లే..

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.