పాపం.. నందమూరి హీరోని సైడ్ చేసేశారట!

సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేనికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చాలా కాలం తరువాత మాస్ మహారాజా రవితేజకి సరైన హిట్టు పడింది. నిజానికి ఈ సినిమా హిట్ మరో హీరో ఖాతాలో పడాల్సిందట. నిర్మాత ఠాగూర్ మధు.. దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేయాలనుకున్నప్పుడు సరైన కథ కోసం వెతికారు. కానీ దొరకలేదు.

దీంతో దర్శకుడు గోపీచంద్.. ‘సేతుపతి’ సినిమా మెయిన్ పాయింట్ ను తనదైన స్టైల్ లో మారుస్తానని చెప్పి కథ మీద వర్క్ చేయడం మొదలుపెట్టాడు. హీరోగా రవితేజను తీసుకోవాలని ముందుగా ఆయన వద్దకు వెళ్లారు. కానీ రవితేజ మొదట రిజెక్ట్ చేశారు. దీంతో ఆ సబ్జెక్ట్ రవితేజ దగ్గరకు వెళ్లింది. ఈ సబ్జెక్ట్ కు కళ్యాణ్ రామ్, ఆయన బంధువు హరి అనే వ్యక్తి మెరుగులు దిద్దారు. హరి ఈ సినిమాలో మామిడికాయ, నోటు, మేకు లాంటి పాయింట్ లను యాడ్ చేయించారు.

ఓ మలయాళ సినిమా స్ఫూర్తిగా ఈ పాయింట్స్ ను తీసుకున్నారు. ఆ తరువాత స్క్రిప్ట్ బాగా వచ్చింది. ఈ విషయం రవితేజ చెవిన పడడంతో ఆయన దర్శకుడు గోపీచంద్ ని పిలిపించుకొని కథ విని ఓకే చేశారు. సినిమాకి ఫస్ట్ ఛాయిస్ రవితేజ కావడంతో యూనిట్ కళ్యాణ్ రామ్ కి సారీ చెప్పి సైడ్ చేసేసింది. ఆ విధంగా కళ్యాణ్ రామ్ ఖాతాలో పడాల్సిన హిట్ రవితేజకి వెళ్లింది. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ చేసి ఉంటే ఎలా ఉండేదో..!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.