టాలీవుడ్లో మరో రెండు క్రేజీ ఆఫర్స్ కొట్టేసిన రష్మిక..!

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన.ఆ తరువాత ‘భీష్మ’ చిత్రం కూడా హిట్ అవ్వడంతో ఈమెకు బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. టాలీవుడ్లో పూజా హెగ్డే తరువాత ఆ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న బ్యూటీ రష్మికనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క కోలీవుడ్లో కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న ‘సుల్తాన్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రష్మిక మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వివరాల్లోకి వెళితే.. అఖిల్ హీరోగా సురేంద్ర డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది. దాంతో పాటు కిషోర్ తిరుమల డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రంలో కూడా రష్మిక మందన హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ తిరుపతిలో మొదలుకానుంది.

అయితే క్రేజ్ పీక్స్ లో ఉన్న టైంలో స్టార్ హీరోలను పక్కన పెట్టి కుర్ర హీరోల సినిమాల్లో నటిస్తుందేంటి అని కొంతమంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నప్పటికీ.. కథ నచ్చడం వల్లనే రష్మిక ఈ ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.