కన్నీళ్ళు పెట్టుకున్న రష్మిక మందన..కారణం అదే…?

సరిగ్గా టాలివుడ్ కు ఎంట్రీ ఇచ్చి మూడేళ్ళు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే స్టార్ హీరోయిన్ అయ్యి కూర్చుంది రష్మిక మందన. ‘ఛలో’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ…ఆ వెంటనే ‘గీత గోవిందం’ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తరువాత ‘దేవదాస్’ ‘డియర్ కామ్రేడ్’ వంటి ప్లాప్స్ అందుకున్నప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ఆ వెంటనే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం … తరువాత చేసిన ‘భీష్మ’ కూడా సూపర్ హిట్ కావడంతో రష్మిక రేంజ్ క్రేజ్ డబుల్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పుడు అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘పుష్ప’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా… మొన్న ఆదివారం నాడు ఆమె పుట్టిన రోజున కన్నీళ్లు రష్మిక కన్నీళ్ళు పెట్టుకోవడంతో చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే…రష్మిక పుట్టిన రోజు కావడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా లో హల్ చల్ చేసి ఆమెను విష్ చేస్తూ కామెంట్స్ పెట్టారు.

Rashmika gets emotional on her birthday1

అయితే… రష్మిక పై భక్తి పెరిగిన ఓ అభిమాని మాత్రం ఏకంగా ఆమె పేరు పై దేవుడికి పాలాభిషేకం చేయించాడు. ఆ వీడియోను చూసిన రష్మిక ఆనందంతో పొంగిపోయింది. ‘ఇంత ప్రేమ పొందడానికి నేనేం చేశాను’ అని రిప్లై ఇచింది ఈ బ్యూటీ. మరో వ్యక్తి ఇప్పటి వరకూ రష్మిక నటించిన సీన్లను జతచేసి ‘రష్మిక ఇన్స్పిరేషనల్ జర్నీ’ అని పేరు పెట్టాడు. ఈ వీడియో చూసిన రష్మిక ఎమోషనల్ అయ్యింది. ‘నువ్వు నన్ను ఎమోషనల్ అయ్యేలా చేసావు. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చాలా థాంక్స్’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది ఈ బెంగుళూరు బ్యూటీ.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.