స్టైలిష్ స్టార్ సినిమా ఛాన్స్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ

టాలెంట్ తోపాటు అందం, ఆ అందాన్ని బహిర్గతపరచగల ధైర్యం ఉన్న అతి తక్కువ టాలీవుడ్ హీరోయిన్స్ లో రాశీఖన్నా ఒకరు. అమ్మడు అటు కమర్షియల్ సినిమాలు, ఇటు ప్రయోగాత్మక చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ భలే నెట్టుకొస్తోంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. బహుశా ఈ విషయమే “ఐకాన్” మేకర్స్ ను ఆలోచించేలా చేసిందేమో తెలియదు కానీ.. నిన్నమొన్నటివరకూ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కనున్న “ఐకాన్” చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలను సంప్రదించినప్పటికీ.. ఇప్పుడు దిల్ రాజు & టీం చూపు రాశీఖన్నాపై పడిందని తెలుస్తోంది.

rashi-khanna-to-romance-allu-arjun1

రాశీఖన్నా దిల్ రాజు బ్యానర్ లోనూ సినిమాలు చేసి ఉండడం.. ఆల్రెడీ తన బ్యూటీ టాలెంట్ ను “బెంగాల్ టైగర్” చిత్రంలో, యాక్టింగ్ టాలెంట్ ను “తొలిప్రేమ” చిత్రంలోనూ ప్రూవ్ చేసుకొని ఉన్నందువల్ల.. ఆల్మోస్ట్ అల్లు అర్జున్ ప్రొజెక్ట్ అమ్మడికి ఫిక్స్ అయినట్లే. ఆల్రెడీ మెగా హీరోల్లో “సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్”లను కవర్ చేసిన రాశీ.. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన నటించే ఆఫర్ సొంతం చేసుకోగలిగితే.. అమ్మడికి కూడా మెగా హీరోయిన్ ట్యాగ్ లభించడం ఖాయం.

Share.