‘రంగ్ దే’ ట్రైలర్ : సూపర్ హిట్ కొట్టేలా ఉందిగా..!

యూత్ స్టార్ నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ ఈ చిత్రం నుండీ వీడియో గ్లింప్స్ విడుదలయ్యింది. దానికి మంచి స్పందన కూడ లభించింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన 4 పాటలు కూడా ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘ఉప్పెన’ తరువాత మరో మంచి ఆల్బుమ్ ను ప్రేక్షకులకు అందించాడు దేవి.ఇక ‘ఇష్క్’ తరువాత మరోసారి పి.సి.శ్రీరామ్.. నితిన్ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తుండడం విశేషం.

మార్చి 26న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ‘నేను అర్జున్.. దేవుణ్ణి(చిన్నప్పుడు) నాకొక గర్ల్ ఫ్రెండ్ ను ప్రసాదించమని కోరుకున్నాను. కోరుకున్న 6వ సెకండ్ కి ఓ పాప మా కాలనీకి వచ్చింది. అప్పట్నుంచి నన్ను తొక్కడం స్టార్ట్ చేసింది’ అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ ప్రారంభం నుండీ చాలా ఫన్ తో సాగింది. నరేష్,అభినవ్ గోమఠం, సుహాస్,వెన్నెల కిశోర్ ల పంచ్ లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

‘మనల్ని ప్రేమించే వాళ్ళ విలువ మనం వాళ్ళని వద్దనుకున్నప్పుడు కాదు.. వాళ్ళు మనల్ని అక్కర్లేదు అనుకున్నప్పుడు తెలుస్తుంది’.

‘నెక్స్ట్ టైం గొడవ కలవడానికి చెయ్యి.. గెలవడానికి కాదు’… వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. నితిన్ ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టేలా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :


శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.