శర్వానంద్-సుధీర్ వర్మల కాంబో అవుట్ పుట్ అదిరింది

భారీ అంచనాల నడుమ విడుదలైన “పడి పడి లేచే మనసు” డిజాస్టర్ గా నిలవడంతో.. శర్వా చాలా అంచనాలు పెట్టుకొన్న “రణరంగం” సినిమాపై ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శిని, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటించారు. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనున్న “రణరంగం” చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఇవాళ కాకినాడలో జరిగిన స్పెషల్ ఈవెంట్ లో విడుదల చేశారు.

ranarangam-theatrical-trailer-review1

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకొన్న తర్వాత మద్యపానం నిషేధించగా.. వైజాగ్ లో దొంగతనంగా మద్యపానం అమ్మడంతో మొదలైన ఒక వీధి రౌడీ ప్రయాణం డాన్ వరకూ ఎలా సాగింది అనేది “రణరంగం” కథాంశంగా ట్రైలర్ లో చూపించడం జరిగింది. శర్వానంద్ క్యారెక్టరైజేషన్ మొన్నామధ్య వచ్చిన షారుక్ ఖాన్ “రాయీస్” చిత్రాన్ని గుర్తుచేయగా.. శర్వానంద్ లుక్ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంది. కళ్యాణి ప్రియదర్శిని విలేజ్ లుక్, కాజల్ అల్ట్రా మోడ్రన్ లుక్ హైలైట్స్ గా నిలుస్తున్నాయి. ప్రశాంత్ పిల్లై బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రెండీగా ఉంది. ఇక కెమెరా యాంగిల్స్ & స్టైలిష్ మేకింగ్ మరియు రా యాక్షన్ బ్లాక్స్ సుధీర్ వర్మ మార్క్ స్పష్టంగా కనిపించింది. తెలుగు తెరకు ఈ తరహా కథలు కొత్త కాకపోయినా.. శర్వానంద్ లుక్ & సుధీర్ వర్మ టేకింగ్ తప్పకుండా వేరే లెవల్ లో ఉండడం ఖాయం కాబట్టి.. ఈ ఆగస్ట్ 15న ప్రేక్షకులు ఒక సరికొత్త డాన్ ను చూడడం ఖాయం అన్నమాట. చూస్తుంటే.. శర్వా “రణరంగం”తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఉన్నాడు.

Share.