ఆకట్టుకుంటున్న ‘రణరంగం’ పాటలు!

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రణరంగం’. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్వామీరారా’ ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఆగష్టు 15 న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్. ఈ చిత్రంలో శర్వానంద్ 2 విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ పిళ్ళై సంగీతమందించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఆడియో జ్యూక్ బాక్స్ ను విడుదల చేశారు. ఇక ఈ పాటలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి.

1) సీతా కళ్యాణం

బాలాజీ లిరిక్స్ అందించిన ఈ పాటని కె.శ్రీహరి పాడాడు. పెళ్ళి నేపథ్యంలో సాగే ఈ పాట ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. లిరిక్స్ చాలా బాగున్నాయి. ఈ పాటకి ప్రశాంత్ పిళ్ళై మంచి ట్యూన్ ఇచ్చాడనే చెప్పాలి.

2) కుమ్మెయ్యరా

కృష్ణ చైతన్య లిరిక్స్ అందించిన ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. అప్పటి రోజుల్లో హీరో.. హీరోయిన్ ను టీజ్ చేస్తే ఎలా ఉంటుందో.. అటువంటి నేపథ్యంలో ఈ పాట సాగుతుందట. సింగర్ కార్తీక్ ఈ పాటని చాలా బాగా పాడాడు. ఈ పాట కూడా ఆకట్టుంటుంది.

3) పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్

ఈ పాటకి కూడా కృష్ణ చైతన్యనే లిరిక్స్ అందించాడు. సింగర్ నికిత గాంధీ ఈ పాటకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో రెండో హీరోయిన్ కాజల్ ఇంట్రొడక్షన్ సాంగ్ అని తెలుస్తుంది. యూత్ ని ఈ పాట కచ్చితంగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి.

4) కన్ను కొట్టి

ఈ పాటకి కూడా కృష్ణ చైతన్యనే లిరిక్స్ అందించాడు. ఇక కార్తీక్ ఈ పాటని చాలా బాగా పాడాడు. మధ్యలో వచ్చే ర్యాప్ లు కాస్త విసుగుపుట్టించినా పర్వాలేదనిపిస్తుంది. సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, శర్వానంద్ కు మధ్యలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ అని తెలుస్తుంది.

5) ఎవరో ఎవరో

కృష్ణ చైతన్య లిరిక్స్ అందించిన ఈ పాటని ప్రీతి పిళ్ళై పాడింది. హీరో, హీరోయిన్లకు మధ్య వచ్చే ఎమోషనల్ సాంగ్ ఇదని తెలుస్తుంది. మంచి ఫీల్ గుడ్ సాంగ్ కి అవసరమైన మేరకు బీట్స్ అందించాడు సంగీత దర్శకుడు పిళ్ళై. లవర్స్ కి సాంగ్ మరింత నచ్చే అవకాశం ఉంది.

ఓవరాల్ శర్వానంద్ నుండీ ఎటువంటి క్లాస్ పాటలని ప్రేక్షకులు ఆశిస్తారో… ప్రశాంత్ ఆ అంచనాలకి రీచ్ అయ్యే ఆల్బం నే ఇచ్చాడని చెప్పాలి. ఎక్కడా రొటీన్ బీట్స్ లేకుండా వినసొంపుగా ఉండే సంగీతాన్ని అందించాడు. సినిమా చూసిన తరువాత ఈ పాటలకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది అనడంలో సందేహమే లేదు.

Share.