బిజినెస్ మాత్రమే కాదు.. బుకింగ్స్ కూడా బాగున్నాయి

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రణరంగం’. ‘స్వామీ రారా’ ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. ఇక ఆగష్టు 15 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ‘రణరంగం’ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

ranarangam-second-song-kannu-kotti-out

నైజాం – 5.0 కోట్లు
వైజాగ్ – 1.5 కోట్లు
ఈస్ట్ – 1.0 కోట్లు

ranarangam-theatrical-trailer-review1
వెస్ట్ – 0.8 కోట్లు
కృష్ణా – 1.0 కోట్లు
గుంటూరు – 1.2 కోట్లు

ranarangam-movie-teaser-review2
నెల్లూరు – 0.5 కోట్లు
సీడెడ్ – 2.0 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ – 13 కోట్లు

ranarangam-to-release-on-independence-day

కర్ణాటక – 0.9 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.3 కోట్లు
ఓవర్సీస్ – 1.8 కోట్లు
——————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 16 కోట్లు
——————————————————————-

ranarangam-movie-teaser-review1

‘రణరంగం’ చిత్రానికి వరల్డ్ వైడ్ 16 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 16 కోట్ల పైనే కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. ఆగష్టు 15 న హాలిడే కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. శర్వానంద్ గత చిత్రం ‘పడి పడి లేచె మనసు’ చిత్రం డిజాస్టర్ అయినా ఈ రేంజ్ బిజినెస్ జరగడం అంత సాధారణ విషయం కాదు. అందులోనూ కాజల్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Share.