యువ హీరోతో మరో సినిమా చేస్తున్న రానా

రానా దగ్గుబాటి ఎలాంటి వినిమా చేసినా కూడా అందులో ఏదో పాయింట్ హైలెట్ అయ్యేలా చూసుకుంటాడు. ముఖ్యంగా తన పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనే విషయంలో రానా ఆలోచించే విధానం మామూలుగా ఉండదు. అసలు మ్యాటట్ లోకి వస్తే దగ్గుబాటి రానా మరొక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. మరో బాహుబలి లాంటి కాంబినేషన్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఫైనల్ గా రానా ఒక కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీకి ఫిదా అయినట్లు టాక్ వస్తోంది. ఆ సినిమాలో మరో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తున్నట్లు సమాచారం. హిట్ సినిమా సమయంలో ప్రమోషన్ లో బాగా హెల్ప్ చేసిన రానా ఇప్పుడు ఏకంగా అతనితో సరిసమానంగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది.

అలాగే తన బాబాయ్ వెంకటేష్ తో కూడా రానా ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. దర్శకుడు సతీష్ వేగేశ్న వీరిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత సురేష్ బాబు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఆ కాంబోపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.