బిలీవ్ ఇండియాతో టై అప్ అయిన రానా టీమ్.!

సౌత్ బే అనేపేరుతో రానా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఛానల్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయని, ముందుగా సెలబ్రిటీ ఇంటర్య్వూస్ తో స్టార్ట్ చేస్తున్నామని గతంలో చెప్పారు కూడా. అయితే, ఇప్పుడు ఈ సౌత్ బే తో ఎక్స్ క్లూజివ్ గా పార్టనర్ షిప్ బేస్ పైన బిలీవ్ ఇండియా సంస్థ ముందుకు రావడం అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఒప్పందం వల్ల సౌత్ బే వ్యూవర్ షిప్ బాగా పెరుగుతుందని, టాలెంట్ ఉన్నవాళ్లందరికీ లిఫ్ట్ ఇస్తామని చెప్తున్నాడు దగ్గుబాటి రానా. అంతేకాదు, బిలీవ్ ఇండియా మాతో టై అప్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందని, దీనివల్ల ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేయచ్చని అభిప్రాయపడ్డారు. బిలీవ్ ఇండియా సంస్ధ డైరెక్టర్ కేజీవి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.., సౌత్ బే వారితో ఒప్పందం చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ లని ప్రోత్సహించడం, మ్యూజిక్ లేబుల్స్ ని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా మా సంస్ధతో జరుగుతాయని, అందుకే సౌత్ బే తో టై-అప్ అయ్యామని అన్నారు. దీనివల్ల సంగీత ప్రపంచంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించొచ్చు అని, దీనివల్ల ఎంతో మంది కళాకారులు బయటకి వస్తారని చెప్పారు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.