అమెరికాలో జరగనున్న రాణా కిడ్నీ ఆపరేషన్, డోనర్ తో సహా సర్వం సిద్ధం

టాలీవుడ్ హాటెస్ట్ హంక్ & మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రాణా దగ్గుబాటి కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే విషయం తెలిసిందే. ఈమేరకు హైద్రాబాద్, ముంబైలలో పలు ఆసుపత్రులలో ట్రీట్ మెంట్ తీసుకొన్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. దాంతో కిడ్నీ ప్రోబ్లమ్ ను క్లియర్ చేయించుకోవడం కోసం అమెరికా వెళ్ళాడు రాణా.

rana-daggubati-with-his-mother

అయితే.. రాణా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం కిడ్నీ డొనేట్ చేస్తున్నది అతడి తల్లి లక్ష్మీ అవ్వడం విశేషం. కొడుకు ఆరోగ్య సమస్య తీర్చడం కోసం తల్లి ముందుకు రావడం గమనార్హం. ఈ ఆపరేషన్ పూర్తయ్యి రాణా పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కనీసం రెండు నెలలు పడుతుంది. మరి ఈలోపు రాణా నటించే సినిమాలన్నీ హోల్డ్ లో పెడతారేమో చూడాలి.

Share.