అంచనాలకు మించి రెడ్ టీజర్..హిట్ కొట్టడం ఖాయమా..!

గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ పోతినేని తాజాగా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. ఇక నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ నుండి వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఈ చిత్ర టీజర్ విడుదలైంది.

Ram's RED Movie Teaser Review1

రెండు భిన్న అవతారాలలో రామ్ కేకగా ఉన్నాడు. మొదటి సారి రెడ్ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఒకరు మాస్ మరొకరు క్లాస్ రోల్ చేస్తున్నారు. ఇక మూవీ ఓ సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తుండగా ఆ క్రైమ్ లో అనుమానితులుగా రామ్ లు ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకే రూపంలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఎవరు అసలు క్రిమినల్ అనే ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా రెడ్ మూవీ ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీస్ రోల్ చేస్తుంది. మలయాళ నటుడు సంపత్ రాజ్ కీలక రోల్ చేసినట్టున్నాడు. టీజర్ లో మణిశర్మ బీజీఎమ్ హైలెట్ అని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫార్మ్ లోకి వచ్చిన మణిశర్మ మరో మారు మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రెడ్ మూవీతో రామ్ మరో హిట్టు కొట్టడతాడు అనిపిస్తుంది.


‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Share.