అల్లుడు తో ఐటమ్ సాంగ్ అదుర్స్..!

బిగ్ బాస్ 4 తో మంచి ఫేమ్ సంపాదించిన మోనాల్ గజ్జర్ ఆతర్వాత వెంటనే అల్లుడు అదుర్స్ లో ఐటమ్ సాంగ్ ఆఫర్ కొట్టేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమా సంక్రాంతి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది ముందుగానే చూపించింది మూవీ టీమ్. రంభ , ఊర్వశి , మేనక అందర్నీ కలిపేస్తే నేనిక అంటూ ఐటమ్ సాంగ్ లో రెచ్చిపోయింది మోనాల్ గజ్జర్.

ఇప్పుడు ఈసాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మోనాల్ ఎనర్జీ, బెల్లంకొండ డ్యాన్స్, వీరిద్దరితో పాటుగా ఈక్వల్ గా డ్యాన్స్ చేస్తూ సోనూసూద్ ఈ ముగ్గురి మద్యలో సాగే ఈ ఐటమ్ సాంగ్ సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధికంగా లైక్స్ సాధించింది ఈ పాట. శ్రీమణి అందించిన బాణీలు, దేవిశ్రీ బీట్ , మోనాల్ ఊపు, బెల్లంకొండ తోపు డ్యాన్స్ అన్నీ కలిపి ఈసాంగ్ సెన్సేషనల్ సృష్టించేలాగానే కనిపిస్తోంది.

అల్లుడు అదుర్స్ ట్రైలర్ లో కూడా ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని చూపించింది మూవీటీమ్. ఈ సంక్రాంతికి ఎలాంటి సినిమా ఉండాలో పక్కా అలాంటి సినిమానే రాబోతోందని ముందుగానే ఆడియన్స్ ని ప్రిపేర్ చేశారు. బెల్లంకొండ ప్రీవియస్ మూవీ రాక్షసుడు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని కాన్ఫిడెంట్ గా ఉంది మూవీ టీమ్. అదీ విషయం.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.