‘రెడ్’ మూవీ ట్రైలర్ రివ్యూ!

ఎనర్జిటిక్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ‘రెడ్’. తమిళ సినిమా ‘తడం’కు ఇది రీమేక్. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. నివేదా పేతురాజ్, అమ్రితా అయ్యర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రభావం కాస్త కనిపిస్తుంది. ఒండులో రామ్ డ్యూయల్ రోల్ పోషించాడు.

ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ మరొకటి మాస్. రామ్ లో ప్రేక్షకులకు నచ్చే మాస్ యాంగిల్ ని బాగా ఎలివేట్ చేసి చూపించారు. ఆ పాత్రను రామ్ బాగా ఓన్ చేసుకొని నటించాడనిపిస్తుంది. ట్రైలర్ లో ఎక్కువగా మాస్ క్యారెక్టర్ నే చూపించారు. అదే సమయంలో కథలో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ను ట్రైలర్ లో చూపించి.. ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశారు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కట్ చేశారు.

హత్యల చుట్టూ సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు కిషోర్ తిరుమల.నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సివుంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎప్పటికైనా థియేటర్లోనే విడుదల చేయాలనే ఆలోచనతో ఓటీటీకి ఇవ్వకుండా అలానే ఉంచేశారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి!


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.