అప్పుడు బెల్లంకొండ ఆడుకున్నాడు.. ఇప్పుడు రామ్ అణగదొక్కాడు

మరి ఎంత మంచిది గుర్తుందో తెలియదు కానీ.. రామ్ మునుపటి సినిమా “ఉన్నది ఒకటే జిందగీ” రిలీజ్ టైంలో రామ్ & కోను బెల్లంకొండ సురేష్ మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఆ సినిమా హార్డ్ డిస్క్ ను తన దగ్గర పెట్టుకొని డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే ఆన్లైన్ లో పెడతానంటూ చేసిన హల్ చల్ అలాంటిలాంటిది కాదు. చచ్చినట్లు డబ్బుల ఇష్యు క్లియర్ చేసుకుని సినిమాను థియేటర్లో విడుదల చేయించుకున్నారు దర్శకనిర్మాతలు.

అప్పట్నుంచి రామ్ & బెల్లంకొండ సురేష్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి వైరం నడుస్తోంది. అయితే.. ఆ సమయంలో సురేష్ దే పైచేయి అయ్యింది. కట్ చేస్తే.. ఈ సంక్రాంతికి రామ్ తన పగ తీర్చుకున్నట్లైంది. రామ్ మీద పోటీకి కావాలని జనవరి 15న విడుదల కావాల్సిన “అల్లుడు అదుర్స్” చిత్రాన్ని కావాలని 14కి ప్రీపోన్ చేసి మరీ విడుదల చేశారు. అయితే.. ఒకేరోజు విడుదలైన “రెడ్, అల్లుడు అదుర్స్” చిత్రాన్ని రెడ్ యావరేజ్ గా నిలిచి..

“అల్లుడు అదుర్స్” డిజాస్టర్ గా నిలవడంతో ఇప్పుడు రామ్ ది పైచేయి అయ్యింది. అయినప్పటికీ.. సురేష్ మాత్రం కావాలని ఈ రోజు వైజాగ్ లో “రెడ్” సక్సెస్ సెలబ్రేషన్ కు పోటీగా “అల్లుడు అదుర్స్” సక్సెస్ సెలబ్రేషన్స్ ను కూడా నిర్వహించాడు బెల్లంకొండ.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.