బ్రేక్ ఇచ్చిన రామ్ పోతినేని.. ఏం చేస్తున్నాడంటే

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవల రెడ్ సినిమాతో మంచి ప్రాఫిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ అనంతరం 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత కొత్తగా ఆకట్టుకోవాలని సస్పెన్స్ థ్రిల్లర్ తో ఈ సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రామ్ పోతినేని శివ దీక్ష వైపు కొన్నాళ్ళు దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.

కొన్నాళ్ళు పూర్తిగా శివమాలలో శివ నామస్మరణ చేసేందుకు రెడీ అయ్యాడు. రామ్ అందుకు సంబంధించిన ఒక స్పెషల్ ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఎప్పుడైనా గ్యాప్ దొరికితే విదేశాలకు ఎక్కువగా వెళ్లే రామ్ ఈ సారి శివుడి ఆరాధనలో మునిగిపోయాడు. ఓం నమశివాయ.. స్మాల్ బ్రేక్.. మళ్ళీ వస్తాను.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రామ్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాడు. ఇక నెక్స్ట్ ఈ హీరో ఏ దర్శకుడితో వర్క్ చేస్తాడు అనేది ఫైనల్ కాలేదు.

వీలైనంత వరకు ఇస్మార్ట్ శంకర్ లాంటి మరో బాక్సాఫీస్ హిట్ అందుకునేలా కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం రెండు కథలను లైన్ లో పెట్టినట్లు సమాచారం. ఇక దీక్ష అనంతరం రామ్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Share.