ఏకంగా పాన్ ఇండియా సినిమా..రామ్ స్కెచ్ అదిరింది..!

వరుస హిట్లతో రామ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి క్లాస్ లవ్ స్టోరీ చేసినా.. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ మూవీ చేసినా.. ‘రెడ్’ వంటి థ్రిల్లర్ సినిమా చేసినా.. ప్రేక్షకులకు చేరువయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు అతని మార్కెట్ కూడా పెరిగింది. అతని సినిమాలకి హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పాన్ ఇండియా సినిమా చెయ్యాలని రామ్ భావిస్తున్నాడు.

నిజానికి ‘రెడ్’ తరువాత త్రివిక్రమ్,అనిల్ రావిపూడి, ప్రవీణ్ సత్తారు వంటి డైరెక్టర్లతో రామ్ సినిమా ఉంటుందని కథనాలు వినిపించాయి. ఒక్క త్రివిక్రమ్ కి రామ్ ఓకే చెప్పాడు.కానీ ఇంకా టైం పడుతుంది. మిగిలిన ఇద్దరు డైరెక్టర్ల స్క్రిప్ట్ లను హోల్డ్ లో పెట్టాడు. ఫైనల్ గా తమిళ దర్శకుడు లింగు స్వామి స్క్రిప్ట్ ను రామ్ ఓకే చేసాడట. తమిళ్ తో పాటు తెలుగులో కూడా లింగుస్వామి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ‘రన్’ ‘పందెం కోడి’ ‘ఆవారా’ సినిమాలు బాగా ఆడాయి.

ఇతను డైరెక్ట్ చేసిన ‘వెట్టై’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘తడాకా’ గా రీమేక్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే సూర్యతో చేసిన ‘అంజాన్'(తెలుగులో ‘సికిందర్’) పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ ‘పందెం కోడి2’ ఇక్కడ డీసెంట్ హిట్ అనిపించుకుంది. పైగా ఇతని సినిమాల్లో యాక్షన్ ఎలిమెంట్స్ బాగుంటాయి. మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన స్టఫ్ ఉంటుంది. అందుకే లింగుస్వామి డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమా చెయ్యడానికి రామ్ రెడీ అయ్యాడట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని టాక్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.