బోయపాటి డైరెక్షన్ లో యంగ్ హీరో!

ఎనర్జటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్’ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో రామ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన దగ్గరకి వచ్చిన చాలా కథలను రిజెక్ట్ చేశాడు. ఫైనల్ గా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లింగుస్వామితో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు.

వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ ని పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో పాటు రామ్ తాజాగా మరో సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.

ఈ సినిమా తరువాత బోయపాటి.. హీరో రామ్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా బోయపాటి.. ఈ యంగ్ హీరోని కలిసి కథ వినిపించారట. అది రామ్ కి నచ్చడంతో ఆయన సినిమా చేయడానికి అంగీకరించినట్లు టాక్. బాలయ్య-బోయపాటి సినిమాను నిర్మిస్తోన్న మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారని సమాచారం. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా బోయపాటి-రామ్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. రామ్.. లింగుస్వామి ప్రాజెక్ట్ పూర్తి చేసిన తరువాత బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.