వర్మ ప్రకటనతో..అమృత ఆత్యహత్య చేసుకోవాలనుకుందట

రెండేళ్ల క్రిందట జరిగిన ఓ మర్డర్ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచంలనం రేపింది. ఓ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన తండ్రి తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను తన కళ్ళ ముందే నరికి చంపించాడు. ఆయనే మిర్యాలగూడకు చెందిన మారుతీ రావు. తన కూతురు అమృత వేరే కులానికి చెందిన ప్రణయ్ ని ప్రేమ వివాహం చేసుకుందన్న కసితో కాంట్రాక్టు కిల్లర్స్ చేత మారుతీ రావు ప్రణయ్ ని మర్డర్ చేయించాడు.

దేశవ్యాప్తంగా ఈ సంఘటన చర్చ లేపగా..నిందితులు అరెస్ట్ చేయబడ్డారు. ఐతే కొన్నాళ్ళు జైలు జీవితం గడిపిన మారుతీ రావు కొద్దిరోజుల క్రితం ఆత్మ హత్య చేసుకొని మరణించాడు. అమృత తన న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉంది. కాగా వర్మ వీరి జీవితాల ఆధారంగా మూవీ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు..నిన్న మర్డర్ పేరుతో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న అమృత వర్మకు ఓ సుదీర్ఘమైన ఆవేదన పూరిత సందేశం పంపింది.

వర్మ ప్రకటన తనలో ఆత్మ హత్య చేసుకుందామన్న ఆలోచన రేపిందట. భర్త లేక అనుక్షణం చిత్ర వధ అనుభవిస్తున్న ఒంటరి మహిళ జీవితాన్ని సినిమా పేరుతో రచ్చకు ఈడుస్తున్న వర్మకు అమ్మ దగ్గర లేకపోవడం వలన విలువలు నేర్పేవారు ఎవరు లేకుండా పోయారు అంది. మొత్తంగా వర్మ చౌకబారు చర్యలను తప్పుబట్టిన ఆమె..వర్మపై జాలిపడింది. వర్మపై న్యాయపోరాటానికి సిద్ధం అన్న ఆమె..చచ్చిపో అని శపించింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Share.