మ‌ళ్ళీ ర‌చ్చ చేసేందుకు వస్తున్న‌ ఆర్జీవి.. ఇక వాళ్ళ‌కి పండ‌గే..?

మిస్ట‌ర్ వివాదం జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ క‌రోనా టైమ్‌లో కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఓటీటీ ద్వారా త‌ను తెర‌కెక్కించిన కొన్ని చిత్ర విచిత్ర‌మైన‌ తిక్క సిన‌మాలు విడుద‌ల చేసి బాగానే క్యాష్ చేసుకున్నాడు. లాక్‌డౌన్ టైమ్‌లో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఓ ప‌ది సినిమాలు పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్స్ ఓపెన్ అవుతుండ‌డంతో వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్ర‌మంలో ముందుగా కోవిడ్ నేప‌ధ్యంలో తెర‌కెక్కిన క‌రోనా వైర‌స్ సినిమాను డిసెంబ‌ర్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు ఆర్జీవి.

క‌రోనా సిట్యువేష‌న్స్‌ని బేస్ చేసుకుని తెర‌కెక్కిన ఈ తొలి సినిమా మూడు నెల‌ల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని డిసైడ్ అవ‌డంతో వెయిటింగ్‌లో పెట్టిన రాము, తాజాగా విడుద‌ల చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక ఆ త‌ర్వాత మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో మర్డర్ సినిమాని తెర‌కెక్కించిన వ‌ర్మ‌.. ఆ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్ర‌క‌టించాడు. ఆ సినిమా విడుద‌ల ఆపాల‌ని అమృత కోర్టుకు వెళ్ళ‌గా, అక్క‌డ తీర్పు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు అనుకూలంగా వ‌చ్చింది. దీంతో మ‌ర్డ‌ర్ సినిమాను డిసెంబ‌ర్ 18న ప్రేక్ష‌కులు ముందుకు వ‌స్తుందని ప్ర‌క‌టించేశాడు. ఇక‌ ఆ తర్వాత రాము ఎంచుకున్న సెన్షేష‌న్ కాన్సెప్ట్ దిశా రేప్ కేస్ అండ్ ఎన్‌ కౌంటర్.

RGV's Murder Movie Trailer Review1

తెలంగాణ‌లో జ‌రిగిన దిశా రేప్ కేస్ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌ర్వాత దిశా నిందితుల‌ను చేసిన ఎన్‌కౌంట‌ర్ కూడా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో దిశా ఎన్‌కౌంట‌ర్ పేరుతో వ‌ర్మ మ‌రో సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్‌లు మాత్రం ఓరేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాను కూడా కంప్లీట్ చేసిన ఆర్జీవి డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని సమాచారం. రామ్‌జి వ‌రుస‌గా సినిమాలు విడుద‌ల చేసిన చూసేందుకు ప్రేక్ష‌కులు రెడీగా ఉన్నారా లేదా అనే చూడాలి. అయితే వ‌ర్మ సినిమా వ‌స్తుందంటే మాత్రం మీడియాకు పండ‌గే, ఏదో ఒక కాంట్ర‌వర్సీతో రోజూ డిబేట్లు చేసుకుంటూ ఫుల్లుగా టీఆర్పీ పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.