మెగాఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్!

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషించనున్నారు. మొదట 20 నుండి 30 నిమిషాల పాటు చరణ్ పాత్ర ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పాత్ర నిడివి పెంచేసినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు కొరటాల శివ చరణ్ పాత్రను ముప్పై నిమిషాల నుండి గంటకు పెంచినట్లు సమాచారం. సినిమాలో చరణ్ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని చెబుతున్నారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ సీన్లు మెగాభిమానులకు కన్నులవిందుగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఓ పాట కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌ చ‌ర‌ణ్‌ కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ,

Chiranjeevi-Koratala Siva Movie Shooting Started

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా, సురేశ్ సెల్వరాజ‌న్‌ ప్రొడ‌క్షన్ డిజైన‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.