శంకర్ చరణ్ మూవీలో హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా తరువాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుండగా రకుల్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో ఇప్పటికే బ్రూస్ లీ, ధృవ సినిమాలు తెరకెక్కాయి.

ఈ రెండు సినిమాలలో బ్రూస్ లీ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకోగా ధృవ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరోవైపు రకుల్ కు ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు రావడం లేదు. శంకర్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ఫిక్స్ అయితే మాత్రం ఈ సినిమా ఆఫర్ రకుల్ కెరీర్ కు ప్లస్ అవుతుందనే చెప్పాలి. చెక్ సినిమాలో రకుల్ లాయర్ పాత్రలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. చెక్ ఫ్లాప్ కావడంతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపైనే రకుల్ ఆశలు పెట్టుకున్నారు.

మరోవైపు డైరెక్టర్ శంకర్ వేర్వేరు కారణాల వల్ల ఇండియన్ 2 షూటింగ్ ఆగిపోవడంతో రామ్ చరణ్ సినిమాపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. లైకా ప్రొడక్షన్ ఇండియన్ 2 నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. శంకర్ చరణ్ మూవీ పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఇండియన్ 2 కోసం రకుల్ కేటాయించిన కాల్షీట్లను శంకర్ చరణ్ సినిమా కోసం వినియోగించుకోనున్నారని తెలుస్తోంది. అయితే హీరోయిన్ గా రకుల్ నే తీసుకుంటారో లేక మరో హీరోయిన్ ను ఎంపిక చేస్తారో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.