‘సైరా’ లో చరణ్ పాత్ర లీక్… కానీ…?

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రాల్లో ‘సైరా’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదల చేసిన ‘సైరా’ మేకింగ్ వీడియో, టీజర్లకు మంచి స్పందన లభించింది. తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది. విడుదలకు నెలరోజులు ముందు నుండే ఈ చిత్రానికి ప్రమోషన్లు పెంచాలని చిరు, చరణ్ లు డిసైడ్ అయ్యారట.ఇందులో భాగంగా ముంబై లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

once-again-ram-charan-to-take-break-for-sye-raa-movie1

‘సైరా’ లో మొదట చరణ్ కోసం కూడా ఓ పాత్ర డిజైన్ చేశారట. కాకపోతే లెంగ్త్ ఎక్కువవుతుంది భావించి ఆ సీన్స్ తీసేశారని చిరు, మరియు చరణ్ తెలిపారు. ‘షేర్ ఖాన్’ అనే పాత్రలో చరణ్.. ‘సైరా’ ఇంటర్వెల్ కు ముందు కనిపించాల్సి ఉందట. కానీ వాటిని తొలగించినట్టు తెలుస్తుంది. గతంలో చిరు, చరణ్ లు కలిసి ‘మగధీర’ ‘బ్రూస్ లీ’ ‘ఖైదీ నెం 150’ చిత్రాలలో కనిపించారు. అప్పుడు అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం మెగా అభిమానులకి నిరాశే మిగిలిందని చెప్పాలి..!

Share.