కొరటాల, త్రివిక్రమ్ తో చరణ్ ప్లాన్!

స్టార్ హీరోలంతా ఓ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే.. తమ తదుపరి సినిమా విషయంలో క్లారిటీతో ఉంటారు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ తరువాత వచ్చే రెండు సినిమాలకు మాత్రం టాప్ డైరెక్టర్లను లాక్ చేసుకున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు త్రివిక్రమ్.. ఎన్టీఆర్, మహేష్ లతో సినిమాలు చేయాల్సవుంది.

ఇక కొరటాల శివతో ఎప్పటినుండో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు చరణ్. ఇప్పటికే ఓ సినిమా మొదలై ఆగిపోయింది. దీంతో ఈసారి కొరటాలతో ఎలాగైనా సినిమా చేయాలనుకుంటున్నాడు చరణ్. ‘ఆచార్య’ సినిమా తరువాత అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు కొరటాల. ఆ తరువాత చరణ్ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రమ్, కొరటాల సినిమాల కంటే ముందుగా రామ్ చరణ్ ఓ సినిమా చేయాలి. అది ఎవరితో చేయనున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి హీరోలను అప్రోచ్ అయ్యాడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. త్వరలోనే చరణ్ ని కూడా సంప్రదించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. తమిళ దర్శకుడు మోహన్ రాజా చెప్పిన కథ రామ్ చరణ్ కి నచ్చిందని.. వీరి కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి చరణ్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.