షూటింగ్ లో చరణ్, చిరు.. ఫొటోస్ లీక్

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ఆచార్య షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సినిమా ఆడియెన్స్ ముందుకు రావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. మే 14న గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వర్క్ చేస్తున్నారు. ఇక సినిమాకు సంబందించిన లొకేషన్స్ స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి.

ఫొటోలో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఒక సాంగ్ ఉంటుందని మొన్నటి వరకు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. బహుశా ఇది సాంగ్ షూట్ కు సంబందించిన లుక్స్ అయ్యుండవచ్చని తెలుస్తోంది. చూస్తుంటే చిరు తనయ కాంబో బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని చాలా క్లారిటీగా ఆర్డమవుతోంది. ఇక మెగాస్టార్ అయితే రామ్ చరణ్ కు ఒక బ్రదర్ అనేలా ఉన్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హిందూ దేవాలయాల సంరక్షణపై ఒక మంచి సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ ను పూర్తి చేసి ఒక స్పెషల్ సాంగ్ ను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.