ఆర్.ఆర్.ఆర్ తప్ప మరో తెలుగు సినిమా చేసే ఆలోచన లేదేమో

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అల వైకుంఠపురములో” చిత్రం షూటింగ్ లో చాలా బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఆ సినిమా అనంతరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఐకాన్” చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామ కోసం గత కొన్ని నెలలుగా వెతుకులాట జరుగుతూనే ఉంది. అయితే.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన కథానాయికగా నటిస్తున్న ఆలియా భట్ ను సంప్రదించారట. హిందీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కేడర్ ను ఎంజాయ్ చేస్తుండడంతోపాటు.. నటిగా ఇప్పటికే పలుమార్లు తన ప్రతిభను నిరూపించుకొన్న ఆలియా భట్ అయితే.. సదరు క్యారెక్టర్ కు కూడా న్యాయం చేస్తుందని భావించారట మేకర్స్.

ram-charan-actress-rejected-allu-arjun1

అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆలియా భట్ “ఐకాన్” సినిమాకి నో చెప్పిందని తెలుస్తోంది. అందుకు కారణం ఆమెకు కథ నచ్చకపోవడమే కాక డేట్స్ కూడా ఖాళీ లేవంట. ఒకవేళ కథ నచ్చి ఉంటే డేట్స్ అడ్జెస్ట్ చేసుకొనేదేమో కానీ.. కథ కానీ ఆమె క్యారెక్టరైజేషన్ కానీ ఆమెకు అంతగా నచ్చలేదట. మరి ఇప్పుడు వేణు శ్రీరామ్ ఎవర్ని ఫైనల్ చేస్తాడో చూడాలి. డిసెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది.

Share.