వరుణ్ ఘని తేజ్ కి రిలీజ్ డేట్ కష్టాలు

“ఆర్ ఆర్ ఆర్” అక్టోబర్ 13కి వస్తుందని జనవరి 25న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తర్వాత చిన్నపెద్ద సినిమాలన్నీ తమ విడుదల తేదీలను వరుసబెట్టి ఎనౌన్స్ చేసుకుంటుపోయారు. అందులో వరుణ్ తేజ్ “ఘని” కూడా ఒకటి. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా.. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.

ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి నటులు కీలకపాత్రలు పోషిస్తుండడంతో సినిమాని అవుట్ పుట్ బట్టి పరాయి భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేద్దామనుకున్నారు. కట్ చేస్తే.. ప్రభాస్ “రాధేశ్యామ్” జూలై 30న విడుదలవుతున్నట్లు టీజర్ తో సహా ఎనౌన్స్ చేశారు. ప్రభాస్ తో పోటీ అనేది ఆలోచన కూడా వేస్ట్ కాబట్టి “ఘని” విడుదల తేదీని మార్చాలని ఫిక్స్ అయ్యారు బృందం. అయితే.. జూన్ నుంచి అక్టోబర్ వరకు సినిమా రిలీజ్ చేయడానికి ఖాళీ లేదు. మార్చిలో విడుదలేమో కష్టం.

దాంతో తమ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేద్దామా లేక వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగుదామా అనే ఆలోచనలో పడ్డారు “ఘని” అండ్ టీం. మెగా హీరో అయిన వరుణ్ తేజ్ కి రిలీజ్ డేట్ కష్టాలు రావడం అనేది గమనార్హం. అయితే.. వరుణ్ ఎక్కువగా స్వంత ఫ్యామిలీ హీరోల సినిమాల నుంచే ఎక్కువ పోటీ ఉండడం విశేషం. మరి వరుణ్ “ఘని” తేజ్ ఎప్పుడు వస్తాడో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.