ఫైటర్ లో హీరోయిన్ ఛాన్స్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు అర్జెంట్ గా ఒక పెద్ద అవకాశం చాలా అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. తాను చాలా భారీ ఆశలు పెట్టుకొన్న “మన్మధుడు 2” డిజాస్టర్ గా నిలవడంతో అమ్మడి తెలుగు కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. సీనియర్ హీరోలతో పెట్టుకొంటే పనవ్వదని గ్రహించి.. యంగ్ హీరోలను టార్గెట్ చేయడం మొదలెట్టింది. అందులో భాగంగానే.. ఇటీవల ఓ ప్రముఖ మీడియా హౌజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ తన ఫేవరెట్ డ్రీమ్ యాక్టర్ గురించి చెబుతూ.. “అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పట్నుంచి విజయ్ దేవరకొండ యాక్టింగ్ కి ఫిదా అయిపోయాను. అప్పట్నుంది అతడితో నటించాలని పరితపిస్తున్నాను. ఒకవేళ విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం వస్తే.. కథ కూడా వినకుండా ఒకే చేసేస్తాను” అని చాలా ఎగ్జైటింగ్ గా చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్.

puri-jagannadh-rakul-preet

అయితే.. విజయ్ కి డైరెక్ట్ గా బిస్కెట్ వేసిన రకుల్, ఇప్పుడు పూరీ జగన్నాధ్ ని టార్గెట్ చేయడం మొదలెట్టింది. తన మేనేజర్ ద్వారా రోజూ పూరీని పలకరిస్తుందట. ఒక కొత్త ఫోటోషూట్ చేయించుకోవడానికి రెడీ అవుతోంది. పూరీకి తన గ్లామర్ టేస్ట్ చూపించి.. ఎలాగైనా ఛాన్స్ కొట్టేయాలని చూస్తోంది. మరి రకుల్ వేస్తున్న ఈ బిస్కెట్స్ ఏమేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.