రకుల్ కూడా అలాగే చెబుతుంది..!

‘మీటూ’ ఉద్యమం ఇండియా వైడ్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి.. మీడియా వేదికగా అలాగే సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. ఎంతో మంది సెలబ్రిటీల పై మీటూ ఆరోపణలు నమోదైన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆ ఉద్యమం పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఫలితంగా అటువంటి ఆరోపణలు చేసిన నటీమణుల పై పరువునష్టం దావాలు కూడా వేశారు.. ఆరోపణలు ఎదుర్కొన్న పెద్దలు. ఇక ఈమధ్య కాలంలో కొందరు చిన్న చిన్న హీరోయిన్లు మాత్రమే ఇంకా కొందరి పై ఆరోపణలు చేస్తున్నారు కానీ పెద్ద హీరోయిన్లయితే.. వాటికి దూరంగా ఉంటూనే వస్తున్నారు.

Rakul Preet in Red Dress latest

ఇక తాజాగా రకుల్ పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం పై స్పందించింది. “క్యాస్టింగ్ కౌచ్ నాకు ఎదురు కాలేదు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం తనతో శృంగారంలో పాల్గొనాలని ప్రపోజ్ చేశాడు. అయితే, ఎంతో మర్యాద పూర్వకంగా తను నన్ను అడిగాడు. మొదట ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చినప్పటికీ… అయితే, అలాంటివి నాతో సెట్ అవ్వవు అంటూ చాలా కూల్ గా చెప్పాను” అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.