‘భారతీయుడు2’ నుండీ కాజల్ ఔట్.. రకుల్ ఇన్..!

‘ఇండియన్ జేమ్స్ కామెరాన్’ గా పాపులర్ అయిన స్టార్ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో.. యూనివెర్సల్ హీరోగా ఎదిగిన కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అయితే సుమారు 13 ఏళ్ళ తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ ను మొదలుపెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే సడెన్ గా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేదాని పై అనేక వార్తలు వచ్చినప్పటికీ.. దర్శకుడికి, నిర్మాతకు విభేదాలు బడ్జెట్ విషయంలో వివాదాలు రావడమే అని తెలుస్తుంది.

rakul-preet-replaced-kajal-aggarwal-in-bharateeyudu2-movie

అందుకే సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. అయితే.. ఇటీవల హీరో కమల్ హాసన్ కొంత చొరవ తీసుకొని ఈ చిత్రం నిర్మాతను.. అలాగే దర్శకున్ని కలిసి.. ‘భారతీయుడు 2’ ఓ కొలిక్కి తీసుకొచ్చాడని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుందని కోలీవుడ్ మీడియా వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట కాజల్ ను అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆమెను తప్పించబోతున్నారనేది తాజా సమాచారం. ఆమె స్థానంలో రకుల్ ను తీసుకోబోతున్నారట. మరి కాజల్ ను తప్పించడానికి కారణాలేంటనేది మాత్రం బయటకు రాలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం కాజల్ చాలా కష్టపడింది. కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలలో ట్రైనింగ్ తీసుకుంది కాజల్. ఆమె కష్టమంతా వృధా అయిపోనట్టే అని తెలుస్తుంది.

Share.