గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రకుల్!

రకుల్ ప్రీత్ సింగ్… అనూహ్యంగా స్టార్ హీరోయిన్ అయ్యింది. అంతే తొందరగా ఆ స్టార్ డం పోగొట్టుకుంది కూడా..! మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడంతో.. రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ఫలితంగా మంచి సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు కూడా కోల్పోయింది. ఆమెకు ప్రస్తుతం హిట్లు లేవు.. బాలీవుడ్ లో రాణించాలని తెగ ప్రయత్నిస్తుంది కానీ అవకాశాలు రావాడం లేదు.

Rakul Preet with Vijay Devarakonda

ఇదిలా ఉంటే.. ఈమె టైం ఎంత బ్యాడ్ గా ఉందో.. ఇటీవల ఆమె తెలిపిన ఓ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏకంగా ఈమె విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ చేసే అవకాశం వస్తే రిజెక్ట్ చేసిందట. మరింత డెప్త్ గా వెళితే.. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం.. అను ఇమ్మాన్యు యేల్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా వచ్చిందట. కానీ కొత్త హీరోతో ఎందుకులే అని రిజెక్ట్ చేసిందట రకుల్. ఇలా కామెంట్ చేసిన రకుల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరో పక్కన ఎందుకు నటించినట్టు. సో అసలు కారణం పారితోషికం అని అర్ధం చేసుకోవచ్చు. ఏమైతేనేం ఆ చిత్రం రిజెక్ట్ చేయడం రకుల్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి.!

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.