మరోసారి ఫిట్‌నెస్‌ ప్రూవ్‌ చేసుకున్న రకుల్‌

రకుల్‌ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఫుల్‌ స్వింగ్‌లోకి వచ్చి అయితే సుమారు ఏడేళ్లు కావొస్తోంది. వచ్చినప్పుడు ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉంది. కారణం ఆమె ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ కావడమో. అలా అని ఏమీ తినకుండా నోరు కట్టేసుకునే రకం కాదు. బాగా తింటుంది, దానికి తగ్గట్టే జిమ్‌లో చెమటోడ్చి ఫిట్‌గా ఉంటూ వస్తోంది. ఆమె ఎంత ఫిట్‌నెస్‌ ఫ్రీకో చెప్పాలంటే… ఖాళీ సమయాల్లో ఏ పుస్తకమో చదవాలి కానీ, ఆమె జిమ్‌కెళ్లిపోతుంది. ఇతర దేశాలకు ఫ్లైట్‌లో వెళ్లినప్పుడు దుబాయి ఫ్లైట్‌ మారుతుంటారు. ఫ్లైట్స్‌ గ్యాప్‌లో కాస్త టైమ్‌ ఉంటే జిమ్‌కి వెళ్లిపోయే రకం ఆమె. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… ఆమె మరోసారి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంది కాబట్టి.

టాలీవుడ్‌లో చిన్న గ్యాప్‌ తర్వాత మళ్లీ జోరు పెంచింది రకుల్‌. వరుస సినిమాలు ఓకే చెప్పేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈలోగా బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటోంది. అలా అమితాబ్‌ బచ్చన్‌ సినిమా ‘మేడే’ ఇటీవల అవకాశం సంపాదించింది. ఆ సినిమా చిత్రీకరణ కోసం ప్రస్తుతం రకుల్‌ ముంబయిలో ఉంది. ఇటీవల సినిమా షూటింగ్‌ కోసం రకుల్‌ ఏకంగా 12 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేసుకుంటూ వెళ్లిందట. ఈ విషయాన్ని ఆమే సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. గతంలోనూ రకుల్‌ తన ఫిట్‌నెస్‌ని నిరూపించుకున్న ఇలాంటి సందర్భాల ఉన్నాయి.

షూటింగ్‌ వెళ్లాల్సిన సమయం దగ్గరపడటంతో ఎక్సర్‌సైజ్‌కు టైమ్‌ లేక రకుల్‌ ఇలా చేసిందట. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ షూటింగ్‌ వెళ్లడం ఆమె సైక్లింగ్‌ వెనుక ఉద్దేశమట. సూపర్‌ కదా రకుల్‌ ఆలోచన… ఆమెనే కాదు యువ నటీమణులు చాలామంది ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నారు. అన్నట్లు ‘మేడే’ సినిమా దర్శకుడు తెలుసు కదా. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఆ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు.


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.