రకుల్ కొత్త బాలీవుడ్ సినిమా ట్రైలర్ అదిరింది

హెడ్డింగ్ చూసి ఇప్పుడు రకుల్ ప్రీత్ వయసు 26 ఏళ్ళు కాబట్టి.. నిజంగానే రకుల్ ప్రీత్ 50 ఏళ్ల పెద్దాయనతో డేటింగ్ చేస్తుందని ఫిక్సయిపోకండి. ఇది ఆమె నటిస్తున్న తాజా చిత్రం కాన్సెప్ట్. రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో నటిస్తున్న తాజా చిత్రం “దేదే ప్యార్ దే” ట్రైలర్ ఇవాళ ఉదయం విడుదలైంది. అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి లవ్ రాజన్ దర్శకుడు. “ప్యార్ కా పంచనామా” సిరీస్ మేకర్స్ నుంచి వస్తున్న ఈ ఫ్యామిలీ కామెడీ సినిమాపై ఇదివరకూ పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ.. ఇవాళ విడుదలైన ట్రైలర్ తో మంచి అంచనాలు నమోదయ్యాయి.

rakul-preet-dating-with-elder-hero1

rakul-preet-dating-with-elder-hero2

50 ఏళ్ల వ్యక్తిగా అజయ్ దేవగన్.. అతడి ప్రియురాలిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రంలో టబు మరో ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం. బాలీవుడ్ లో హిట్ కొట్టాలన్న రకుల్ ప్రీత్ సింగ్ కల ఈ చిత్రంతో నెరవేరేలా ఉంది. మే 17న విడుదలవుతున్న ఈ సినిమా గనుక హిట్ అయ్యిందంటే.. బాలీవుడ్ నుంచి మళ్ళీ రకుల్ కి వరుస ఆఫర్లు రావడం ఖాయం.

Share.