అర్జున్ రెడ్డి చూసినప్పట్నుంచి విజయ్ తో నటించాలని తపిస్తున్నాను

“వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” తర్వాత రకుల్ టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించేసింది. అయితే.. “స్పైడర్” ఆమె కెరీర్ కు స్పీడ్ బ్రేకర్ లా మారింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆమెను పట్టించుకొనేవారు లేకుండాపోయారు. ఆ తర్వాత అమ్మడు తమిళంలో బిజీ అయిపోవడం, తెలుగులో నటించిన “మన్మధుడు 2” కూడా డిజాస్టర్ గా నిలవడంతో.. అమ్మడికి తెలుగులో ఆఫర్లు సన్నగిల్లాయి. ప్రస్తుతం నితిన్-చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ సినిమా ఒక్కటే అమ్మడి చేతిలో ఉంది.

rakul-preet-and-vijay-deverakonda

అయితే.. ఇటీవల ఓ ప్రముఖ మీడియా హౌజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ తన ఫేవరెట్ డ్రీమ్ యాక్టర్ గురించి చెబుతూ.. “అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పట్నుంచి విజయ్ దేవరకొండ యాక్టింగ్ కి ఫిదా అయిపోయాను. అప్పట్నుంది అతడితో నటించాలని పరితపిస్తున్నాను. ఒకవేళ విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం వస్తే.. కథ కూడా వినకుండా ఒకే చేసేస్తాను” అని చాలా ఎగ్జైటింగ్ గా చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్. మరి రకుల్ ఇంత ఓపెన్ గా చెప్పిన తన కోరికను విజయ్ తీరుస్తాడో లేదో చూడాలి.

1

vijay-deverakonda-latest-stills-1

2

vijay-deverakonda-latest-stills-2

3

vijay-deverakonda-latest-stills-3

4

vijay-deverakonda-latest-stills-4

5

vijay-deverakonda-latest-stills-5

6

vijay-deverakonda-latest-stills-6

7

vijay-deverakonda-latest-stills-7

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.