బెల్లంబాబు ఈసారైనా హిట్టు కొడతాడా?

‘ఏ స్టూడియోస్’ బ్యానర్ పై రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాక్షసుడు’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం.. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘రాచ్చసన్’ చిత్రానికి రీమేక్. జిబ్రాన్ సంగీత దర్శకుడు. ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఆగష్టు 2న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించి తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.

rakshasudu-theatrical-trailer-review1

‘నేనంటే భయానికి భయం.. నన్ను పట్టుకోవాలనుకోకు.. పట్టుకుందామనుకున్నా.. అది నేనవ్వను’ అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. ఓ సైకో కిల్లర్.. ఆడపిల్లల్ని చిత్ర హింస చేసి చంపుతుంటాడు. ఆ సైకో కిల్లర్ ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఆడపిల్లల్ని ఎందుకు చంపుతున్నాడు.. అతనెవరు.. అనేది సస్పెన్సు గా ఉంచారు. తమిళం నుండీ ఈ చిత్రాన్ని అదే విధంగా దించేశారు. ఉన్న ఒక్క ఫైట్ మాత్రం మార్చినట్టున్నారు. కానీ విష్ణు విశాల్ స్థాయిలో బెల్లంకొండ నటన ఆకట్టుకోదు. కానీ ఆ చిత్రం చూడని వాళ్ళకి ఈ ట్రైలర్ నచ్చే అవకాశం ఉంది. ఈ ట్రైలర్ లో హీరోయిన్ అనుపమ అక్కడక్కడా కనిపించింది. బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ మాత్రం అక్కట్టుకుంటుంది. మరి ఈ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని ఆదుకుంటాడో బెల్లంకొండ..! ‘రాక్షసుడు’ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Share.